భోపాల్ : మధ్యప్రదేశ్‌లో మొత్తం 1355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 23070 శాంపిళ్లను పరీక్షించారు. ఇంకా 2708 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇండోర్, భోపాల్‌లలో అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో 881, భోపాల్‌లో 208 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 69 మంది కరోనా బారినపడి మృతిచెందారు. వీరిలో 47 మంది ఇండోర్‌కు చెందిన వారే ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా పాజిటివ్ కేసులు