న్యూఢిల్లీ : మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!)
కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం